చదువుకున్న యువతకు MPTC/ZPTC/SARPANCH అవకాశాలు ఎందుకు ఇవ్వాలి అనేవారికి చదువు ఉంది సత్తా ఉంది గ్రామాన్ని మార్చే దమ్ము యువతకే ఉంది

పారదర్శక పాలన అవినీతి అంతం డిజిటల్ గ్రామం ఉద్యోగాల కల్పన ప్రశ్నించే సంస్కృతి పథకాల ప్రజల వరకు కులానికి కాదు అభివృద్ధికి ఓటు భవిష్యత్తు నాయకత్వానికి ఫౌండేషన్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం

తిరుపతి జిల్లా 

రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్ డి పి ఎస్ నియోజకవర్గం అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ 

చదువుకున్న యువతకు MPTC /ZPTC/ SARPANCH అవకాశాలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రతి ఒక్కరికి యువత ఇచ్చే సందేశం చదువుంది సత్తా ఉంది గ్రామాన్ని మార్చే దమ్ము యువతకే ఉంది ఇది ప్రతి ఒక్కరు గమనించాలి

చదువుకున్న యువతకు టెక్నాలజీ తెలుసు. గ్రామ పంచాయతీ నిధులు, MGNREGS, సచివాలయం యాప్స్ లో ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఆన్లైన్ లో పెడతారు. కాగితం లేకుండా, కమీషన్ లేకుండా పని జరుగుతుంది.

డిగ్రీ చేసిన సర్పంచ్ మాత్రమే గ్రామంలో స్కిల్ సెంటర్, లైబ్రరీ, ఇంటర్నెట్, చిన్న పరిశ్రమలు తీసుకురాగలడు. కేవలం రోడ్డు కాదు, యువతకు గ్రామంలోనే ఉపాధి చూపగలడు.

చదువుకున్న MPTC/ZPTC కలెక్టర్ తో, MLA తో కూర్చుని మాట్లాడగలడు. రైతు భరోసా, ఇంటి పట్టాలు, స్కూల్ డెవలప్మెంట్ నిధులు అధికారులను నిలదీసి తీసుకురాగలడు. భయపడడు.

యువత నాయకత్వంలోకి వస్తే గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు తగ్గుతాయి. సీఎం రాశి పల్లి లాంటి చిన్న గ్రామాల్లో కూడా అందరినీ కలుపుకుని పోయే నాయకత్వం వస్తుంది.

ఈరోజు సర్పంచ్ గా గెలిచిన యువతే రేపు MLA, MP. చిన్న వయసులోనే పరిపాలన నేర్చుకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైల్వే కోడూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాలకు బలమైన గొంతు దొరుకుతుంది.

ప్రతి సంవత్సరం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోనే 2802 మంది విద్యార్థులు డిగ్రీ పట్టా సాధించి వస్తున్నారు వారికి ఎటువంటి ఉద్యోగం అవకాశాలు ఇవ్వనప్పటికీ కనీసం సమాజాన్ని వ్యవస్థని అదేవిధంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మార్పు తీసుకురావాలని లక్ష్యం యువతరంకు ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదు ఎందుకు యువతరం మీద సమాజానికి ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం 

ఒక్క కడప జిల్లా నే తీసుకుంటే డిగ్రీ కళాశాలలో 154 కళాశాలలో ఉన్నాయి దీనిబట్టి మీరే ఒకసారి ఆలోచించండి.